Home Actor సీత విడుద‌ల తేదీ ఖ‌రారు..!

సీత విడుద‌ల తేదీ ఖ‌రారు..!

106
0

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం సీత‌. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారానే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇంత వరకూ చేయని ఒక విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అంటున్నారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ న‌టించిన మూడ‌వ సినిమా ఇది. గ‌తంలో తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ ల‌క్ష్మీ క‌ళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here