Home Actor సీమ నుంచి వలసలు నివారించి సౌభాగ్య రాయలసీమగా అభివృద్ధి చేస్తాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

సీమ నుంచి వలసలు నివారించి సౌభాగ్య రాయలసీమగా అభివృద్ధి చేస్తాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

79
0


రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచి వ‌ల‌స‌లు నివారించేందుకు జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ సౌభాగ్య రాయ‌ల‌సీమ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు. సీమను సౌభాగ్యవంతంగా అభివృద్ధి చేస్తామనీ, ఇందుకు సంబంధించి ద‌శాబ్ద కాలానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్టు తెలిపారు. అనంత‌పురం జిల్లాను అత్యంత వెనక‌బ‌డిన జిల్లాగా గుర్తించినా, అభివృద్దికి ఎవరూ పైసా ఇచ్చింది లేద‌న్నారు. జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా ధ‌ర్మ‌వ‌రం, అనంతపురంల‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌ల్లో పాల్గొన్నారు.

స‌భ‌లకు హాజ‌రైన ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ… “రూ.50 వేల‌ కోట్ల‌తో రాయ‌ల‌సీమ‌కి పెట్టుబ‌డులు పెట్టే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటాం. యువ‌త ఉపాధి కోసం వ‌ల‌స‌లు వెళ్ల‌కుండా నివారించి, ఇక్క‌డే అవ‌కాశాలు క‌ల్పిస్తాం. ఇంటి ద‌గ్గ‌రే ఉండి త‌ల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు. ఇక బిడ్‌తల వ‌ల‌స‌ల కార‌ణంగా ఒంట‌రిగా మిగిలిన పెద్ద‌లను చూసుకునేందుకు మండ‌లానికి ఒక్క‌టి చొప్పున ప్ర‌భుత్వం నుంచి ఆదర‌ణ నిల‌యాలు ఏర్పాటు చేస్తాం. అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేయాల‌న్న కోరిక ఉన్నా, జ‌న‌సైనికులు ఉన్నంత అండ‌గా నాయ‌కులు నా ప‌క్క‌న లేరు.

ఆ స్థాయిలో నాయ‌కులు నాకు అండ‌గా ఉండి ఉంటే ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఉండేవాడిని. క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ఇక్క‌డి నుంచి పోటీ చేసే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నా. ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రం మొత్తం తిర‌గాల్సి వ‌చ్చిన‌ప్పుడు, స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గాన్ని చూసుకునే నాయ‌కులు అవ‌స‌రం ఉంది. రాయ‌ల‌సీమ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మ‌రే ముఖ్య‌మంత్రి అభివృద్ది చేయ‌ని స్థాయిలో అభివృద్ధిప‌రుస్తాం. అనంత‌పురం జిల్లాని ద‌త్త‌త తీసుకుని మ‌రీ అభివృద్ది చేస్తాం. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో చీఫ్ మినిస్ట‌ర్ క‌మాండింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేసి, స‌చివాల‌యం నుంచి ఇక్క‌డ జ‌రిగే అభివృద్దిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తాం.

చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రణాళికలు తీసుకొస్తాము. వారి కోసం ప్ర‌త్యేక హ్యాండ్లూమ్ జోన్స్ ఏర్పాటు చేస్తాం. త‌క్కువ వ‌డ్డీకి రుణాలు మంజూరు చేస్తాం. ఇళ్లు లేని చేనేత కార్మికుల‌కి ఇళ్లు క‌ట్టించి ఇస్తాం. 50 శాతం స‌బ్సిడితో ముడి స‌రుకు ఇప్పిస్తాం. ధ‌ర్మ‌వ‌రం చేనేత కార్మికులకు మ‌ద్ద‌తుగా యూరోపియ‌న్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ల‌ను తీసుకువ‌వ‌చ్చి అనుసంధానించి ప్ర‌త్యేక మార్కెటింగ్ అవ‌కాశాలు క‌ల్పిస్తాం. మ‌గ్గాలు లేని వారికి సొంత మ‌గ్గాలు అందిస్తాం. సెజ్‌ల మాదిరి ప్ర‌త్యేక చేనేత జోన్లు ఏర్పాటు చేస్తాం. 59 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి నేత కార్మికుడుకి సైతం రూ. 5 వేల పించ‌న్ అందిస్తాం అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here