Home Actor సుజిత్ ఇంట‌ర్నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అవుతాడు – ప్ర‌భాస్

సుజిత్ ఇంట‌ర్నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అవుతాడు – ప్ర‌భాస్

44
0

రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజా చిత్రం సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ నటించింది. ఈ చిత్రం ఆగస్ట్‌ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆగష్టు 18న ‘సాహో’  ప్రీ రిలీజ్‌ వేడుకను భారీ స్ధాయిలో హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు భారీస్థాయిలో ప్రేక్షకులు, అభిమానులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ… ”ఫ్యాన్స్‌, డైహార్డ్‌ ఫ్యాన్స్‌ డైలాగ్స్‌ రాసింది డైరెక్టర్‌ సుజితే. తనకు మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. సినిమాటోగ్రాఫ‌ర్ మది నా కుటుంబ సభ్యుడిలా సపోర్ట్‌ చేశారు. సాబుసిరిల్‌గారిని నేను ఈ సినిమా చేయమని అడిగాను.. ఆయన కథ విన్నారు. ఆయనకు నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ శ్రీకర్‌గారు చేసిన సాయం చాలా పెద్దదే. కమల్‌ కణ్ణన్‌గారు సినిమాకు ఇంటర్నేషనల్‌ లుక్‌ తీసుకొచ్చారు. జిబ్రాన్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. జాకీష్రాఫ్ గారికి, చంకీ గారికి, అరుణ్‌ విజయ్ గారికి, లాల్‌గారికి, నీల్‌ నితిన్‌ ముఖేష్‌గారు సహా అందరికీ థ్యాంక్స్‌. అనీల్‌ టడాని తొలి రోజు నుండే సపోర్ట్‌ చేస్తూ వచ్చారు. భూషణ్‌గారికి థ్యాంక్స్‌.

సుజిత్‌ నిక్కరేసుకొచ్చి కథ చెప్పాడు. వంశీ, ప్రమోద్‌, విక్కీలు అప్పటికే కథ విన్నారు. వారికి నచ్చింది. సుజిత్‌ కథ చెప్పేటప్పుడ తన వయసు 23ఏళ్లు. నలభై ఏళ్ల వ్యక్తిలా కథ చెప్పాడు. సినిమాను ఓ స్టేజ్‌ అనుకున్నాం. సినిమా చాలా పెద్దదైంది. సుజిత్‌ ఈ సినిమా కోసం చాలా ప్రీ ప్రొడక్షన్‌ చేశాడు. సినిమా షూటింగ్‌ సమయంలో పెద్ద పెద్ద స్టార్స్‌, టెక్నీషియన్స్‌ ను ఎలా హ్యాండిల్‌ చేస్తాడోనని అనుకున్నాను. తను హ్యాండిల్‌ చేసిన విధానానికే గ్రేటెస్ట్‌ డైరెక్టర్‌ అయిపోతాడనిపించింది. నాలుగేళ్ల పాటు సినిమా కోసం కష్టపడ్డాడు. తను ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ అయిపోతాడని అనుకుంటున్నాను.

శ్రద్ధాకపూర్‌.. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం పనిచేసింది. ఓ నటి ముంబై నుండి వచ్చి ఇక్కడ రెండేళ్లు పనిచేసింది. ఒక్కరోజు కూడా సమస్య రాలేదు. శ్రద్ధాకపూర్‌లాంటి హీరోయిన్‌ సాహోకు దొరకడం మా అదృష్టం. తను సూపర్బ్‌ పెర్ఫామర్‌. యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసింది. గత సినిమా సమయంలో ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చా.. మిస్సయ్యాం. కానీ ఈసారి మాట ఇవ్వకుండా ఏడాది రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వంశీ, ప్రమోద్‌, విక్కీ వందకోట్ల లాభం వదులుకుని ఈ సినిమా చేశారు. చాలా మంచి స్నేహితులు. ఇలాంటి స్నేహితులు అంద‌రికీ ఉండాలి” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here