Home Actor సునీల్..చెప్పింది ఆ సినిమా గురించేనా..?

సునీల్..చెప్పింది ఆ సినిమా గురించేనా..?

140
0

క‌మెడియ‌న్ గా కెరీర్ ప్రారంభించి..త‌న‌దైన శైలిలో న‌టించి.. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన సునీల్ త‌ర్వాత క‌థానాయ‌కుడుగా మారి అందాల రాముడు, పూల రంగ‌డు, మ‌ర్యాద రామ‌న్న‌, భీమ‌వ‌రం బుల్లోడు త‌దిత‌ర చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు. అయితే…ఆత‌ర్వాత హీరోగా చేసినా సునీల్ కి స‌క్స‌స్ ని ఇవ్వ‌లేదు. దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన సునీల్ మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా న‌టించేందుకు ఓకే చెప్పాడు.

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అర‌వింద స‌మేత చిత్రంలో న‌టించాడు. తాజాగా సాయితేజ్ చిత్ర‌ల‌హ‌రి చిత్రంలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. చిత్ర‌ల‌హ‌రి విజ‌యం సాధించిన సంద‌ర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ…త్వ‌ర‌లో ఓ పెద్ద హీరో చేయ‌నున్న సినిమాలో న‌టించ‌నున్నాను అంటూ చాలా సంతోషంగా చెప్పారు కానీ..ఆ పెద్ద హీరో ఎవ‌రో..? ఆ సినిమా ఏంటో మాత్రం చెప్ప‌లేదు.

అయితే…లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…సునీల్ చెప్పింది… చిరు – కొర‌టాల సినిమా గురించి అని వార్త‌లు వ‌స్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం 150లోనే సునీల్ న‌టించాలి కానీ..డేట్స్ ప్రాబ్ల‌మ్ వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ చిరు మూవీలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అంతే..వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా ఓకే చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం కొర‌టాల శివ స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌రలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే క‌నుక నిజమైతే..సునీల్ కి బంపర్ ఆఫ‌రే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here