Home Actor సురేష్ బాబు గారు.. ఓ..బేబి సినిమాతో మాకు ప్రాఫిట్స్ ఇచ్చి పాఠాలు నేర్పారు –...

సురేష్ బాబు గారు.. ఓ..బేబి సినిమాతో మాకు ప్రాఫిట్స్ ఇచ్చి పాఠాలు నేర్పారు – కో – ప్రొడ్యూస‌ర్ వివేక్ కూచిభోట్ల‌

43
0
సురేష్ బాబు గారు.. ఓ..బేబి సినిమాతో మాకు ప్రాఫిట్స్ ఇచ్చి పాఠాలు నేర్పారు - కో - ప్రొడ్యూస‌ర్ వివేక్ కూచిభోట్ల‌ spiceandhra

స‌మంత తాజా సంచ‌ల‌నం ఓ.. బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రానికి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేషాద‌ర‌ణ ల‌భిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో కూడా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకుని రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ అందిస్తుంది. ఈ క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. సెకండ్ వీక్ లో సైతం ఓ..బేబి హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో.. స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతూ..రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. ఈ సంద‌ర్భంగా కో – ప్రొడ్యూస‌ర్ వివేక్ కూచిభోట్ల ఓ.. బేబి స‌క్స‌స్ సంతోషాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.

రామానాయుడు స్టూడియ‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో వివేక్ కూచిభోట్ల మాట్లాడుతూ… ఓ బేబి సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రోజే బుక్ మై షోలో స్ర్కీన్ షాట్ తీసాను. లాస్ట్ 24 హ‌వ‌ర్స్ లో హ‌య్య‌స్ట్ సేల్స్ ఉన్న మూవీగా ఓ.. బేబి ట్రెండండింగ్ లో నిలిచింది. హైద‌రాబాద్ లో హిందీ సినిమాలు ఉన్నాయి.. ఇంగ్లీషు సినిమాలు ఉన్నాయి.. వాటిని కాద‌నుకుని…అది కూడా 9వ రోజున మా సినిమాకి హ‌య్య‌స్ట్ సేల్స్ ఉండ‌డం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. యు.ఎస్ లో ఈరోజుకి క‌లెక్ష‌న్స్ 1 మిలియ‌న్ మార్క్ ద‌గ్గ‌ర‌కి చేరుకుంటాయి. దుబాయ్ త‌దిత‌ర లోకేష‌న్స్ లో మాస్ సినిమాలే ఎక్కువుగా ఆడ‌తాయి అనుకుంటారు కానీ.. మాస్ సినిమాల‌ కంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ అక్క‌డ ఓ.. బేబి చిత్రానికి వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు బేబి ఎంత బాగా ఆకట్టుకుందో.

ఇక సురేష్ బాబు గారు గురించి చెప్పాలంటే… ఆయ‌న చాలా ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ప్రొడ్యూస‌ర్. ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా క‌ష్టం. ఓ పెళ్లి చేయ‌డం ఎంత క‌ష్ట‌మో అంత క‌ష్టం. అయితే… సినిమా నిర్మాణం కానీ.. సినిమాని రిలీజ్ చేయ‌డం కానీ.. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో చాలా ఈజీ. ఆయ‌న గైడెన్స్ ఉండ‌డం అనేది మాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. మాకు ప్రాఫిట్స్ ఇచ్చి పాఠాలు నేర్పారు. ఈ ఎక్స్ పీరియ‌న్స్ ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.

స‌మంత న‌టిస్తుంది కాబ‌ట్టి సాంగ్ పెడ‌దాం.. సీన్స్ పెంచుదాం.. ఇలా ఏం చేయ‌లేదు. మ‌న‌ నేటివిటికి త‌గ్గ‌ట్టు మార్పులు చేసాం అంతే. ప్రీ ప్రొడ‌క్ష‌న్ టైమ్ లో సురేష్ బాబు గారు.. ప్ర‌తి రోజు ద‌గ్గ‌ర ఉండి ఈ సినిమాకి ఏం చేస్తే బాగుంటుంది.? అది ఎలా చేయాలి..? అనేది చెప్పేవారు. సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత స‌మంత‌, నందినీకి ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చారు. ఆ ఫ్రీడ‌మ్ ని వారిద్ద‌రు పూర్తిగా వినియోగించుకున్నారు. అంద‌రికీ న‌చ్చేలా మంచి సినిమాని అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ సినిమాని నిర్మిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ మామ 70% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ద‌స‌రాకి ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here