Home Telugu సుశాంత్  చి ల సౌ రిలీజ్ డేట్ ఫిక్స్..!

సుశాంత్  చి ల సౌ రిలీజ్ డేట్ ఫిక్స్..!

130
0
Sushanth Chi la sow

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కాళిదాసు, కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా..చిత్రాల‌తో న‌టుడిగా మెప్పించినా..ఆశించిన స్ధాయిలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ మాత్రం సాధించ‌లేదు. ఈసారి క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించ‌డం కోసం చి ల సౌ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

సుశాంత్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు పూర్తి భిన్నంగా రూపొందిన చి ల సౌ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేస్తున్న‌ట్టు అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసింది. ఈ మూవీని చూసిన నాగ్ సినిమా బాగా న‌చ్చ‌డం వ‌ల్ల‌నే డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌కు అన్న‌పూర్ణ సంస్థ‌లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చార‌ట‌. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్‌ పతాకంపై జస్వంత్‌ నడిపల్లి, భరత్‌ కుమార్‌ మలశాల, హరి పులిజల ఈ సినిమాను నిర్మించారు. స‌రైన స‌క్సస్ కోసం వెయిట్ చేస్తోన్న సుశాంత్ కి చి ల సౌ ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here