Home Telugu సుశాంత్ చి ల సౌ వాయిదా..?

సుశాంత్ చి ల సౌ వాయిదా..?

130
0
Sushanth Chi la Sow

 

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి ల సౌ. ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో సుశాంత్‌, రుహాని శర్మ జంటగా నటించారు. టీజ‌ర్ తో ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు ఈ సినిమా క‌థ..దీనిని తెర‌కెక్కించిన విధానం న‌చ్చ‌డంతో అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ముందుకు వ‌చ్చింది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తుండ‌డం..పాజిటివ్ టాక్ ఉండ‌డంతో ఓవ‌ర్ సీస్ లో కూడా ఈ సినిమాకి క్రేజ్ ఏర్ప‌డింది. అయితే… ఈ సినిమాని ఈ నెల 27న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ..అదే రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ తెర‌కెక్కించిన సాక్ష్యం సినిమా రిలీజ్ కానుంది. మ‌రో వైపు మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక న‌టించిన హ్యాపీ వెడ్డింగ్ కూడా అదే రోజు రిలీజ్ కి రెడీ అవుతోంది.

అందుచేత వీటితో పోటీప‌డి రిలీజ్ చేయ‌డం కంటే ఆత‌ర్వాత వారంలో రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. అందుచేత సుశాంత్ చి ల సౌ ఆగ‌ష్టు 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here