Home Uncategorized సుశాంత్ చి ల సౌ సెన్సార్ పూర్తి..!

సుశాంత్ చి ల సౌ సెన్సార్ పూర్తి..!

131
0
Chi la Sow release date

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి ల సౌ. ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో సుశాంత్ స‌ర‌స‌న రుహాని శ‌ర్మ న‌టించారు. సిరుని సినీ కార్పొరేషన్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. కాళిదాసు, కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం..చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ సుశాంత్ కి స‌రైన స‌క్స‌స్ రాలేదు.

దీంతో రొటీన్ గా కాకుండా డిఫ‌రెంట్ గా సినిమా చేయాల‌ని ఉద్దేశ్యంతో చి ల సౌ సినిమా చేసాడు. ఈ సినిమా నాగార్జున‌కి చాలా బాగా న‌చ్చేసింద‌ట‌. అందుక‌నే ఈ సినిమాని అన్న‌పూర్ణ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.అంతే కాదండోయ్ తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి సినిమాని తీసిన డైరెక్ట‌ర్ రాహుల్ వ‌ర్క్ న‌చ్చ‌డంతో అన్న‌పూర్ణ సంస్థ‌లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి  యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఆగ‌ష్టు 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. మ‌రి…ఈ సినిమా అయినా సుశాంత్ కి ఆశించిన స‌క్స‌స్ అందిస్తుంద‌ని ఆశిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here