Home Actor సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్ 26వ చిత్రం ప్రారంభం..!

సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్ 26వ చిత్రం ప్రారంభం..!

81
0

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా ఘట్టమనేని అభిమానులకు మహేష్ బాబు తీపి కానుక అందజేశారు. తన 26వ చిత్రాన్నిసినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభించారు. ఈ మూవీ టైటిల్ ను, టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు అని పేరును పెట్టినట్టు కృష్ణ స్వయంగా చెప్పారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అవుతుందని అన్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్స‌వం ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జ‌రిగింది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. దిల్ రాజ్, అనిల్ సుంకర, ఘట్టమనేని మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న రష్మిక మందన న‌టిస్తుంది. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

స‌రిలేరు నీకెవ్వ‌రు ఫస్ట్ లుక్ లో  టైటిల్ పక్కన తుపాకీ, పోలీస్ టోపీ పెట్టడంతో ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ గా నటించబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది. మ‌రి..మ‌హ‌ర్షి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ఏరేంజ్ స‌క్స‌స్ సాధిస్తాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here