Home Movie News సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ – న్యూస్ లీక్ చేసిన హీరో..!

సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ – న్యూస్ లీక్ చేసిన హీరో..!

91
0
Krishna biopic news

టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఊపందుకుంది. ఇటీవ‌ల అల‌నాటి న‌టి సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టి పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం..సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. కాంతారావు బ‌యోపిక్ రూపొందించేందుకు ప్లాన్ జ‌రుగుతోంది. జ‌గ‌ప‌తిబాబు బ‌యోపిక్ ను సీరియ‌ల్ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవ‌ల క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ బ‌యోపిక్ ను ప్రారంభించారు. దీనికి జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు సుధీర్ బాబు. న‌న్ను దోచుకుందువ‌టే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా కాలేజీల‌కు వెళుతున్న సుధీర్ బాబు సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ రానుంద‌ని తెలియ‌చేసారు. 300ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన కృష్ణ రాజ‌కీయాల్లో కూడా ప్ర‌వేశించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ రాజీవ్ గాంధీ మ‌ర‌ణంతో రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు.

ఆయ‌న బ‌యోపిక్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంద‌ని, తెర పై చూడాల‌ని అభిమానులు ఎదురు చూస్తున్నారు.అయితే.. సుధీర్ బాబు కృష్ణ బ‌యోపిక్ రానుంద‌ని చెప్పాడు కానీ…ఈ భారీ చిత్రానికి నిర్మాత ఎవ‌రు..?  డైరెక్ట‌ర్ ఎవ‌రు..?  అనేది మాత్రం చెప్ప‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here