Home Telugu సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టిస్తోన్న ర‌కుల్ ప్రీత్ సింగ్..!

సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టిస్తోన్న ర‌కుల్ ప్రీత్ సింగ్..!

113
0
Rakul in Mahesh movie

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, క‌రెంట్ తీగ‌, కిక్ 2, నాన్న‌కు ప్రేమ‌తో.., స‌రైనోడు, థృవ‌, రారండోయ్ వేడుక చూద్దాం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. స్పైడ‌ర్ సినిమాలో మ‌హేష్ బాబుతో క‌లిసి న‌టించింది కానీ..ఆ సినిమా స‌క్స‌స్ సాధించ‌లేదు.  ఆత‌ర్వాత ఈ అమ్మ‌డు త‌మిళ చిత్రాలపై దృష్టి పెట్ట‌డం వ‌ల‌నే అనుకుంట తెలుగులో  ఒక్క సినిమాకి కూడా సైన్ చేయ‌లేదు. ఇటీవ‌లే విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టించే అవకాశం ద‌క్కించుకుంది.

తాజాగా ఈ అమ్మ‌డు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో మ‌రోసారి న‌టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో ఏప్రిల్ 5న రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్..సుకుమార్ తో మూవీ చేయ‌నున్నాడు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించేందుకు ర‌కుల్ ప్రీత్ సింగ్ ని సెలెక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here