Home News Movie News సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శైల‌జారెడ్డి అల్లుడు.!

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శైల‌జారెడ్డి అల్లుడు.!

4
0
d750f0a1-69c1-4ab0-baab-4f77b0edbebf

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌మ్య‌కృష్ణ చైతుకు అత్త‌గా న‌టించ‌డం..అత్త‌, అల్లుడు కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే… ఫ‌స్ట్ డే మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ..క‌లెక్ష‌న్స్ మాత్రం సూప‌ర్ అనేలా వ‌చ్చాయి.

తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ లోనే 2.50 కోట్ల, సీడెడ్ లో 1.04 కోట్లు, ఉత్త‌రాంధ్ర – 0.82 ల‌క్ష‌లు, ఈస్ట్ 72 ల‌క్ష‌లు, వెస్ట్ 42 ల‌క్ష‌లు, కృష్ణ 40 ల‌క్ష‌లు, నెల్లూరు 23 ల‌క్ష‌లు, గుంటూరు 80 ల‌క్ష‌లు, టోట‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో క‌లిపి  6.93 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా సమాచారం. రెండో రోజు కూడా ఇదే జోరు కొన‌సాగింది. వినాయ‌క చ‌వితి ఫెస్టివ‌ల్ & లాంగ్ వీకెండ్ ఈ సినిమాకి బాగా క‌లిసొచ్చింది. ఫ‌స్ట్ వీక్ లోనే రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన శైల‌జారెడ్డి అల్లుడు..ఫుల్ ర‌న్ లో ఇంకెంత క‌లెక్ట్ చేస్తాడో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here