Home Telugu  సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న ఆర్.ఎక్స్ 100

 సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న ఆర్.ఎక్స్ 100

131
0
RX 100 collections

కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ ఫుత్ జంట‌గా అజ‌య్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ చిత్రం ఆర్.ఎక్స్ 100. ఈనెల 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు. టీజ‌ర్ తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఆర్ ఎక్స్ 100 ఇప్పుడు రిలీజ్ త‌ర్వాత రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు వ‌ర్షాలు ప‌డుతున్నా…తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన అన్ని థియేట‌ర్ల‌లో ఈ చిత్రం హౌస్ ఫుల్ అవ్వ‌డం విశేషం.

నైజాం – 65 ల‌క్ష‌లు, సీడెడ్ – 20 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర – 14 ల‌క్ష‌లు, ఈస్ట్ – 13.69 ల‌క్ష‌లు, వెస్ట్ – 7.32 ల‌క్ష‌లు, కృష్ణ – 8.44 ల‌క్ష‌లు, గుంటూరు 9 ల‌క్ష‌లు, నెల్లూరు – 4 ల‌క్ష‌లు మొత్తం క‌లిపి ఫ‌స్ట్ డే ఏపీ, నైజాంల‌లో 1.42 కోట్లు షేర్ సాధించింది. ఈ వీకెండ్ లోనే ఈ సినిమా లాభాల బాట‌లో ప‌య‌నించ‌డం ఖాయం అంటున్నారు సినీ పండితులు. మ‌రి..ఈ సెన్సేష‌న‌ల్ మూవీ ఫుల్ ర‌న్ లో ఇంకెంత సాధిస్తోందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here