Home Actor సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న విన‌య విధేయ రామ ట్రైల‌ర్..!

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న విన‌య విధేయ రామ ట్రైల‌ర్..!

95
0

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ విన‌య విధేయ రామ‌. డి.వి.వి. దాన‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విన‌య విధేయ రామ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే…రామ్ చ‌ర‌ణ్ యాక్ష‌న్, బోయ‌పాటి టేకింగ్ ఈ సినిమాకి హైలైట్ కానున్నాయ‌ని తెలుస్తుంది. అలాగే ఫ్యామిలీ ఎమోష‌న్స్, ఫైట్స్, సాంగ్స్..ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాల‌తో ఈ మూవీ ఉంటుంద‌నిపిస్తోంది. దీనికి తోడు ఈ వేడుక‌లో బోయ‌పాటి మాట్లాడుతూ..మెగా ఫ్యాన్స్ కి హామీ ఇస్తున్నాను. గుండెల పై చేయి వేసుకుని ఈ సినిమా చూడండి. అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు. ఈ మాట‌ల‌తో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఇక‌ ఈ ట్రైల‌ర్ ను ఇలా రిలీజ్ చేసారో లేదో..యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 2 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి 3 మిలియ‌న్ దిశ‌గా వెళుతోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విన‌య విధేయ రామ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here