Home Actor సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌నిఖిల్ అర్జున్ సుర‌వ‌రం టీజ‌ర్.

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌నిఖిల్ అర్జున్ సుర‌వ‌రం టీజ‌ర్.

63
0


యువ నిఖిల్, లావ‌ణ్య జంట‌గా న‌టిస్తోన్న చిత్రం అర్జున్ సుర‌వ‌రం. ఈ చిత్రానికి సంతోష్ దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్ ను  శివరాత్రి సందర్భంగా  రిలీజ్ చేశారు. ఇందులో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టించారు. లవ్, యాక్షన్ ఎమోషన్ ప్రధానంగా సాగే సన్నివేశాల పై కట్ చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే…ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ .. కానీ ఒక నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడం చాలా కష్టం. వెతికేవాడు దొరకట్లేదు .. వెతకాల్సినవాడు తెలియట్లేదు..అనే  డైలాగ్స్ బాగున్నాయి. ఈ టీజర్ .. చాలా తక్కువ టైమ్ లోనే  1 మిలియన్ వ్యూస్ ను రాబట్టేయడం విశేషం. అంతే కాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో 3వ స్ధానంలో ఉండ‌డం మ‌రో విశేషం. 

రాజ్ కుమార్,  వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన విడుదల చేయ‌నున్నారు. మ‌రి..టీజ‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ సుర‌వ‌రం సినిమాతో కూడా సంచ‌ల‌నం సృష్టిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here