Home News సైబ‌ర్ నేర‌స్తుల నుంచి మీ ఓటును కాపాడుకోండి – చంద్ర‌బాబు..!

సైబ‌ర్ నేర‌స్తుల నుంచి మీ ఓటును కాపాడుకోండి – చంద్ర‌బాబు..!

89
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏప్రిల్ 11న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి ఒక్కరు ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. ట్విట్ట‌ర్ లో చంద్ర‌బాబు స్పందిస్తూ…రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవటానికి ఈ ఆర్థిక నేరస్థులు, సైబర్ నేరస్తుల నుంచి మీ ఓటు కాపాడుకుని, ఏప్రిల్ 11 ఎన్నికల్లో మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, తరువాతి తరాల వారి భవిష్యత్తు, కాపాడే వారి కోసం మీ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించాలని మనవి చేస్తున్నాను.

నేరం చేయటం నేరస్తుల అలవాటు. అది ఆర్థిక నేరమైనా, సైబర్ క్రైం అయినా నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా చేస్తారు. అధికారం లేకుండానే రాష్ట్రాన్ని దోచుకున్న వారు, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎటువంటి కుట్రలు, ద్రోహాలు, దోపిడీలు చేయటానికైనా వెరవరు, ఎన్నికల్లో అడ్డదారిన గెలవటానికి ఎంతకైనా తెగిస్తారు.

రాష్ట్రంలో ఓటరుగా నమోదు చేయించుకోవటానికి అవసరమైన ఫారం-6 అందజేయటానికి ఈ రోజు ఆఖరు రోజు. మీకెవరికైనా ఓటర్ లిస్టులో మీ పేరు లేదని తెలిస్తే, వెంటనే మీ వివరాలను ఫారం-6 నింపి సంబంధిత అధికారికి అందచేసి ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here