Home Actor సైరాలో స్టైలీష్ స్టార్..?

సైరాలో స్టైలీష్ స్టార్..?

84
0

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతానికి ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.  ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న‌ నయనతార నటిస్తుంటే..అమితాబ్ బచ్చన్, జ‌గ‌ప‌తిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

అయితే… ఈ చిత్రానికి సంబందించిన ఓ  ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే..ఈ సినిమాలో చిరుతో పాటు మరో మెగా హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్నాడ‌ని. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా సైరాలో బ‌న్నీ న‌టించ‌డం క‌న్ ఫ‌ర్మ్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే.. సైరా పై మ‌రిన్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆత‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ను స్పీడుగా కంప్లీట్ చేసి ద‌స‌రా కానుక‌గా భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here