Home Telugu సైరా ఏం జ‌రుగుతోంది..? అస‌లు చిరు ప్లాన్ ఏంటి..?

సైరా ఏం జ‌రుగుతోంది..? అస‌లు చిరు ప్లాన్ ఏంటి..?

119
0

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్లోగా జ‌రిగిన షూటింగ్ ఇప్పుడు మంచి స్పీడుతో వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. చిరు పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించేందుకు కోకాపేట ద‌గ్గ‌ర ఏడు ఎక‌రాల్లో భారీ సెట్ వేసార‌ట‌. ఈ సెట్ లో దాదాపు 40 రోజులు పాటు షూటింగ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో ఈ మూవీని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అందుచేత సైరా షూటింగ్ ను త్వ‌ర‌గా కంప్లీట్ చేసి కొర‌టాల‌తో సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నార‌ట చిరు. సైరా చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఆ టైమ్ కి  కొర‌టాల‌తో చేయ‌నున్న సినిమా దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఈ సినిమాని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. స్ర్కిప్ట్ వ‌ర్క్ కంప్లీట్ అయిన తర్వాత‌ పూర్తి వివ‌రాల‌ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది. చిరు ప్లాన్ బాగానే ఉంది కానీ…సైరా అనుకున్న టైమ్ కి కంప్లీట్ అవుతుందో..?  లేదో..?  చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here