Home Actor సైరా మేకింగ్ వీడియో రిలీజ్ – టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.

సైరా మేకింగ్ వీడియో రిలీజ్ – టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.

11
0

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న సైరా సినిమాని అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ఈ రోజు మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. అమితాబ్, చిరంజీవి, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా…ఇలా ప్ర‌ధాన తారాగ‌ణం గెట‌ప్స్.. మేకింగ్ వీడియోలో చూపించారు. సినిమా ఏ స్ధాయిలో ఉండ‌బోతుందో ఈ వీడియోలో చూపించ‌డంతో సైరా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అభిమానుల‌కు మ‌రో కానుక‌గా సైరా టీజ‌ర్ ను ఈ నెల 20న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here