Home Uncategorized సైరా లో ఆ ఎపిసోడ్ కోస‌మే అంత ఖ‌ర్చు పెడుతున్నారా..?

సైరా లో ఆ ఎపిసోడ్ కోస‌మే అంత ఖ‌ర్చు పెడుతున్నారా..?

128
0

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం రాత్రివేళ న‌ర‌సింహారెడ్డికి, ఆంగ్లేయుల‌కు మ‌ధ్య జ‌రిగే పోరాట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

సినిమాకి హైలైట్ గా నిలిచే ఈ యుద్ధ స‌న్నివేశాల‌ను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ఆధ్వర్యంలో చిత్రీక‌రిస్తున్నారు. భారీ సంఖ్యలో హాలీవుడ్ ఫైటర్స్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అందుచేత‌ ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 40 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. దీనిని బట్టి అర్ధం చేసుకోవ‌చ్చు  ఈ చిత్రాన్ని ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.  చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here