Home Movie News సైరా లో త‌మ‌న్నా గెట‌ప్ రిలీజ్ చేసిన టీమ్..!

సైరా లో త‌మ‌న్నా గెట‌ప్ రిలీజ్ చేసిన టీమ్..!

89
0

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ భారీ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న
ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి స‌ర‌స‌న అందాల తార న‌య‌న తార న‌టిస్తుంది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని ఏ మాత్రం రాజీప‌డ‌కుండా నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రంలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఓ ముఖ్య పాత్ర‌ను పోషిస్తుంది. ఈ రోజు త‌మ‌న్నా పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా  సైరా టీం ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో మిల్కీ బ్యూటీకి బర్త్‌డే విషెస్‌ తెలియజేసింది. ఇందులో త‌మ‌న్నా పాత్ర పేరు ల‌క్ష్మిగా ప‌రిచ‌యం చేసిన సైరా టీమ్ విడుద‌ల చేసిన త‌మ‌న్నా లుక్ కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి ఇత‌ర ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం వ‌చ్చే సంవ‌త్స‌రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here