Home Actor సైరా సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

సైరా సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

35
0
సైరా సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..? spiceandhra

మెగాస్టార్ చిరంజీవితో స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సైరా చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది.

సురేంద‌ర్ రెడ్డి, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్, రామ‌చ‌ర‌ణ్ ల‌తో సినిమాలు చేయాల‌నుకున్నారు కానీ.. ప్ర‌స్తుతం ఈ ముగ్గురు హీరోల డేట్స్ ఖాళీగా లేవు. తాజా వార్త ఏంటంటే… సురేంద‌ర్ రెడ్డి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్ర‌భాస్ కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఇటీవ‌ల ప్ర‌భాస్ ని క‌లిసి స్క్రిప్ట్ గురించి డిష్క‌స్ చేసిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న రొమాంటిక్ డ్రామా షూటింగ్ లో పాల్గొంటాడు. ప్ర‌భాస్ క‌నుక సురేంద‌ర్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే… ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మ‌రి.. సురేంద‌ర్ రెడ్డికి ప్ర‌భాస్ ఓకే చెబుతాడా..?  లేదా..?  అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here