Home Movie News సైరా సెట్ లో ప‌వ‌ర్ స్టార్. ఈ ఫోటో ఎలా లీకైందో తెలుసా..?

సైరా సెట్ లో ప‌వ‌ర్ స్టార్. ఈ ఫోటో ఎలా లీకైందో తెలుసా..?

101
0
Pawan in Syra set

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ లెజండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సైరా న‌ర‌సింహారెడ్డి టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్ ను ఫ‌స్ట్ క‌ళ్యాణ్ బాబాయ్ కే చూపించాన‌ని…మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తెలియ‌చేసారు.

ఇదిలా ఉంటే…సైరా సెట్ కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లి చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్ ల‌ను క‌లిసారు. అక్క‌డే ఉన్న రామ్ చ‌ర‌ణ్, రైట‌ర్ స‌త్యానంద్ వీరంతా క‌లిసి ఓ ఫోటో తీయించుకున్నారు.  ఆ ఫోటోను చిరంజీవి, రైట‌ర్ స‌త్యానంద్ కి పంపించార‌ట‌. ఆ ఫోటోను స‌త్యానంద్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ‌డంతో ఈ ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here