Home Actor స్పీడు పెంచిన మెగా హీరో.

స్పీడు పెంచిన మెగా హీరో.

7
0

స్పీడు పెంచిన మెగా హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..?  మెగాస్టార్ మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ యువ ద‌ర్శ‌కుడు మారుతితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్ర‌తి రోజు పండ‌గే అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఇదిలా ఉంటే… చిత్ర‌ల‌హ‌రి సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన తేజు వ‌రుస‌గా సినిమాలు చేస్తూ స్పీడు పెంచాడు.

ఈ సినిమా త‌ర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందుతుంది. దీనిని యు.వి క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమాతో పాటు ఆయన మరో రొమాంటిక్ కామెడీ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాతో సుబ్బు అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

ఈ మూవీని బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌నున్నారు. ఒక వైపున మేర్లపాక గాంధీతో సినిమా చేస్తూనే, మరో వైపు నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు సినిమాను కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్రాల గురించి త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here