Home Actor స్పోర్ట్స్ మూవీలో..కీర్తి సురేష్.

స్పోర్ట్స్ మూవీలో..కీర్తి సురేష్.

149
0

నేను శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమై..అన‌తి కాలంలోనే ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. మ‌హాన‌టి సినిమాతో ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది. ఓ వైపు తెలుగు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో వైపు త‌మిళ చిత్రాల్లో కూడా న‌టిస్తూ కెరీర్ లో దూసుకెళుతోంది. తెలుగులో ఆమె నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే సినిమాలో న‌టిస్తున్నారు.

నగేశ్ కుకునూర్ హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్ చిత్రాలు తెర‌కెక్కించారు. తాజా చిత్రానికి సుధీర్ చంద్ర – శ్రావ్యవర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తారనీ .. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తార‌ని తెలిసింది. త‌ను వెడ్స్ మ‌ను ఫేమ్ చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు ప్రధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. త్వరలో టైటిల్ ను ఖరారు చేసి సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here