Home Actor స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

11
0

దేశ ప్రజలందరికీ నా తరఫున, జనసైనికుల తరఫున 73వ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు. పరాయి పాలనలో మగ్గిపోతున్న మన నేలకు స్వాతంత్య్ర‌ ఫలాలు అందించడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ త్యాగధనులకు అంజలి ఘటించి… వారి అడుగుజాడల్లో నడిస్తేనే వారి పోరాటానికి నిజమైన విలువ లభిస్తుంది అని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.

తారతమ్యాలు లేకుండా ప్రతి ఒకరూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఆ పోరాటాల వల్లే మనకు దక్కింది అనే వాస్తవాన్ని మననం చేసుకొంటూ ముందడుగు వేయాలి. అవినీతి, అక్రమాల నుంచి సమాజాన్ని రక్షించుకోవాలి. రాజకీయ జవాబుదారీతనం సిద్ధించినప్పుడే సమరయోధులు తీసుకువచ్చిన స్వాతంత్య్రానికి సార్థకత చేకూరుతుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here