Home Actor స్వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ న‌న్ను అలా చేయ‌మ‌న్నారు – వ‌ర్మ‌..!

స్వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ న‌న్ను అలా చేయ‌మ‌న్నారు – వ‌ర్మ‌..!

84
0

నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తూ..రోజురోజుకు ఈ సినిమా పై అంచ‌నాలను పెంచేస్తున్నారు వ‌ర్మ‌. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ విషయమై వర్మ స్పందించారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే… క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న‌ ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా రిలీజ్ తేదీని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసిన‌ 24 నిమిషాల్లోనే తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తానని వర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

ఇలా చేయాలని ఎన్టీఆర్ తనను స్వర్గం నుంచి హెచ్చరించారన్నారు. ఆయన కుమారుడు తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు ఎన్టీఆర్ ఆశీస్సులు లభించలేదని స్పష్టమయిందని వర్మ అన్నారు. ఎన్టీఆర్ కేవలం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మాత్రమే ఆశీర్వదించబోతున్నారని తెలియ‌చేసారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా కోసం ప్ర‌స్తుతం కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. మ‌రి..ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుతో పోటీ ప‌డుతున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here