Home Telugu స‌మంత‌కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్..!

స‌మంత‌కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్..!

184
0
mahanati-director- samantha

నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం మ‌హాన‌టి. కీర్తి సురేష్ సావిత్రిగా న‌టించ‌గా, దుల్క‌ర్ స‌ల్మాన్ జెమిని గ‌ణేష‌న్ గా న‌టించారు. విజ‌య దేవ‌ర‌కొండ‌, స‌మంత ముఖ్య పాత్ర‌లు పోషించారు. మోహ‌న్ బాబు, నాగ చైత‌న్య‌, క్రిష్, త‌రుణ్ భాస్క‌ర్, ప్ర‌కాష్ రాజ్, అవ‌స‌రాల శ్రీనివాస్ గెస్ట్ రోల్స్ లో న‌టించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై రూపొందిన మ‌హాన‌టి సినిమా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతూ 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ..స‌మంత కీర్తి సురేష్ తో పోటీప‌డ‌లేదు. సావిత్రి గారితో స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం కోసం పోటీప‌డ్డారు. మ‌రో న‌టి చేయ‌ని విధంగా స‌మంత త‌న పాత్ర‌ను పోషించారు. ఈ సినిమా షూటింగ్ లో తొలిరోజు పాల్గొన్న న‌టి ఆమె. ఇది ఫ‌స్ట్ డే బ‌స్సులో తీసిన ఫ‌స్ట్ సీన్ అంటూ స‌మంత వ‌ర్కింగ్ స్టిల్ పోస్ట్ చేసారు. ఈ బ‌యోపిక్ ఓ చ‌రిత్ర‌గా నిలిచేందుకు స‌మంత ఎంత‌గానో స‌హాయ‌పడ్డారు అంటూ స‌మంత‌కు థ్యాంక్స్ తెలియ‌చేసాడు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here