Home Telugu స‌మంత‌తో చేస్తోన్నసినిమాలో చైతు క్యారెక్ట‌ర్ ఇదే..!

స‌మంత‌తో చేస్తోన్నసినిమాలో చైతు క్యారెక్ట‌ర్ ఇదే..!

113
0

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో న‌టిస్తున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. నాగ‌చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ‌, అను ఇమ్మాన్యుయేల్ ల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక స‌వ్య‌సాచి కంప్లీట్ అవ్వ‌డానికి ప‌ది రోజుల షూటింగ్ చేయాల్సివుంది. జులై ఫ‌స్ట్ వీక్ లో స‌వ్య‌సాచి కోసం డేట్స్ ఇచ్చాడు చైతు.

ఈ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిన త‌ర్వాత చైతు నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇందులో చైతు స‌ర‌స‌న స‌మంత న‌టిస్తోంది. ఈ సినిమాలో చైత‌న్య క్రికెట‌ర్ గా న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. నాని జెర్సీ సినిమాలో క్రికెట‌ర్ గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా క్రికెట‌ర్ గా న‌టిస్తుండ‌డం విశేషం.

ఈ సినిమాతో పాటు చైత‌న్య బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇందులో వెంక‌టేష్ తో క‌లిసి న‌టించ‌నున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here