Home Actor స‌మంత‌…ఏ టైమ్ లో పుట్టావు.. అమ్మా నువ్వు – ఛార్మి

స‌మంత‌…ఏ టైమ్ లో పుట్టావు.. అమ్మా నువ్వు – ఛార్మి

45
0
స‌మంత‌...ఏ టైమ్ లో పుట్టావు అమ్మా నువ్వు - ఛార్మి spiceandhra

స‌మంత అక్కినేని న‌టించిన తాజా చిత్రం ఓ..బేబి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న క‌థా చిత్రం నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఓ..బేబి చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి విశేషాద‌ర‌ణ ల‌భిస్తుంది. 20 ఏళ్ల అమ్మాయిగా క‌నిపిస్తూ…70 ఏళ్ల బామ్మ‌గా ప్ర‌వ‌ర్తించే పాత్ర‌లో స‌మంత అద‌ర‌గొట్టేసింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్న ఈ చిత్రం ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… ఛార్మింగ్ గాళ్ ఛార్మి ట్విట్ట‌ర్ లో…ఏ టైమ్ లో పుట్టావు అమ్మా..నువ్వు. నీ హార్డ్ వ‌ర్క్ నీ నిర్ణ‌యాలు మ‌రియు నీ జాత‌కానికి న‌మ‌స్కారం. సామ్ రాక్స్..ఓ బేబి రాక్స్ అంటూ స‌మంత గురించి స్పందించింది. దీనికి సామ్‌ రిప్లై ఇచ్చారు. ‘నువ్వు ఎంతో క్యూటెస్ట్‌.. ధన్యవాదాలు ఛార్మి. నీకు నా ఆత్మీయ కౌగిలి, ముద్దుల్ని పంపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ఛార్మి నవ్వుతూ.. ఎమోజీలను పోస్ట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here