Home Actor స‌మ్మ‌ర్ సిత్రాలు వ‌చ్చేస్తున్నాయ్..!

స‌మ్మ‌ర్ సిత్రాలు వ‌చ్చేస్తున్నాయ్..!

89
0


సినిమాల‌కు పెద్ద పండ‌గ అంటే సంక్రాంతి. ఆత‌ర్వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సినిమాలు రిలీజ్ చేయాలంటే… స‌మ్మ‌ర్ ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తుంటారు. స‌మ్మ‌ర్ వ‌చ్చేస్తుండ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద  పోటీప‌డేందుకు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ స‌మ్మ‌ర్ లో భారీ చిత్రాలు పోటీప‌డుతుండ‌డంతో ఏ సినిమా విజేత‌గా నిలుస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది.

మార్చి 29న‌ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌వేశించిన త‌ర్వాత జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు క‌థా వ‌స్తువుగా రూపొందడం…దీనికి తోడు ఎన్నిక‌లు కూడా ద‌గ్గ‌ర‌లో ఉండ‌డంతో  ఈ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాతో పాటు ఈ నెల 29న రిలీజ్ అవుతున్న మ‌రో చిత్రం సూర్య‌కాంతం. నిహారిక, రాహుల్ విజ‌య్, పెర్లిన్ భెసానియా ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన ఈ సినిమాకి ప్ర‌ణీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ 1 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఈ స‌మ్మ‌ర్ లో వ‌స్తున్న ఫ‌స్ట్ బిగ్ మూవీ అంటే మ‌జిలీ. ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టించిన మొద‌టి చిత్రం ఇది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం పై ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు టీజ‌ర్ & సాంగ్స్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ మూవీ ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార్రర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2.  సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు.  ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. గ‌తంలో ఇదే బ్యాన‌ర్ లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి, హార‌ర్ కామెడీ సినిమాల‌కు తెలుగునాట ట్రెండ్ క్రియేట్ చేసిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ కు సీక్వెల్ గా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 రెడీ అయింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఉగాది కానుక‌గా ఏప్రిల్ 6న ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

స‌రైన స‌క్సస్ కోసం ఎద‌రుచూస్తున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయితేజ్ న‌టిస్తోన్న తాజా చిత్రం చిత్ర‌ల‌హ‌రి. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు.  నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని రెండు పాట‌ల‌ను రిలీజ్ చేసారు. ఈ పాట‌లు యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఏప్రిల్ 12 వ‌స్తున్న ఈ సినిమా పై తేజు చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.

నాని న‌టిస్తోన్న తాజా చిత్రం జెర్సీ. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ టీజ‌ర్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో ఇది రెగ్యుల‌ర్ మూవీ కాదు. ఇందులో మంచి క‌థ ఉంద‌నే ఫీలింగ్ క‌లిగించింది. ఇటీవ‌ల కాలంలో కాస్త వెన‌క‌బ‌డిన నాని ఈ సినిమా మీద చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. ఇది ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

యంగ్‌ హీరో నిఖిల్ న‌టించిన తాజా చిత్రం అర్జున్ సుర‌వ‌రం. టి. సంతోష్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈసినిమాలో జర్నలిస్ట్‌ పాత్ర పోషిస్తున్న నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని మే 1న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌హేష్ బాబు న‌టించిన భారీ చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మ‌హేష్ చేస్తోన్న సినిమా కావ‌డం..ఇది మ‌హేష్ కి 25వ సినిమా కావ‌డంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. మే 9న ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు.

క‌థానాయిక స‌మంత, ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం ఓ.. బేబీ. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కి సోష‌ల్ మీడియాలో ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాని మే నెలాఖ‌రున రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. సెన్స‌ష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న  ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా మే 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

వీటితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – తేజ‌ల సీత‌, అల్లు శిరీష్ ఏబీసీడీ, విష్ణు ఓట‌ర్, రామ్ , పూరి మూవీ ఇస్మార్ట్ శంక‌ర్, లారెన్స్ కాంచ‌న 3, సూర్య ఎన్.జి.కే త‌దిత‌ర చిత్రాలు ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. మ‌రి…ఈ స‌మ్మ‌ర్ లో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్న ఈ చిత్రాల్లో ఏ ఏ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here