Home News స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారిస్తా..మ‌రింత‌గా అభివృద్ధి చేస్తా – రాజ‌మండ్రి అర్బ‌న్ జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారిస్తా..మ‌రింత‌గా అభివృద్ధి చేస్తా – రాజ‌మండ్రి అర్బ‌న్ జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

79
0


రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తున్న అత్తి స‌త్య‌నారాయ‌ణ రాజ‌మండ్రిలో ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. రాజ‌మండ్రిలోని తాడితోటలో గల శ్రీ మహాత్మా గాంధీ హోల్ సేల్  క్లాత్ మార్కెట్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అక్కడికి విచ్చేసిన ఆయనకు హోల్ సేల్ వర్తక సోదరులు, జట్టు కూలి కార్మికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి తమ మద్దతు తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా అత్తి సత్య‌నారాయ‌ణ మాట్లాడుతూ…జ‌న‌సేన పార్టీలో చేరిన‌ప్పుడు నాకు తెలిసిన చాలా మంది ఎందుకు జ‌న‌సేన‌లో చేరుతున్నావ్..?  తెలుగుదేశం పార్టీలో కలుస్తాడు. మ‌ళ్లీ సినిమాల్లోకి వెళ్ల‌తాడు. ఇలా..ర‌క‌ర‌కాలుగా నిరుత్సాహ‌ప‌రిచినా మా నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి మీద ఉన్న న‌మ్మ‌కంతో పార్టీ చేరాను. న‌మ్మ‌కానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న నేను ఆశించిక పోయినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఎంత‌గానో ప్రొత్స‌హించారు.  ఈరోజు జ‌న‌సేన పార్టీకి ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుంది. ఈ స్పంద‌న చూస్తుంటే..చాలా సంతోషంగా ఉంది.

రాజ‌మండ్రి సిటీలో ఉన్న‌ సమస్యలను, రాష్ట్ర స్థాయిలో సమస్యలను జనసేన ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ ఖ‌చ్చితంగా పరిష్కరిస్తానని మాట ఇస్తున్నాను అని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జనసేన,సిపిఐ,సిపిఎం,బహుజన సమాజ్ పార్టీ నాయకులతోపాటు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here