Home Actor స‌రిలేరు నీకెవ్వ‌రులో జ‌గ‌ప‌తి న‌టించ‌డం లేదా..?

స‌రిలేరు నీకెవ్వ‌రులో జ‌గ‌ప‌తి న‌టించ‌డం లేదా..?

37
0
స‌రిలేరు నీకెవ్వ‌రులో జ‌గ‌ప‌తి న‌టించ‌డం లేదా..? spiceandhra

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ మూవీ స‌రిలేరు నీకెవ్వ‌రు. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇటీవ‌ల స్టార్ట్ అయ్యింది. మ‌హేష్‌బాబు, అనిల్ సుంక‌ర‌, దిల్‌రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో జ‌రుగుతోంది. అయితే.. ఈ సినిమా నుంచి జ‌గ‌ప‌తిబాబు త‌ప్పుకున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ సినిమా కోసం జ‌గ‌ప‌తి బాబు రెండు సినిమాలు వ‌దుల‌కుని మ‌రీ డేట్స్ ఇచ్చార‌ట‌. అలాంటిది ఈ మూవీ నుంచి జ‌గ‌ప‌తి త‌ప్పుకోవ‌డం ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… జ‌గ‌ప‌తి పాత్ర‌ను ముందు చెప్పిన దాని కంటే ఇప్పుడు బాగా త‌గ్గించార‌ట‌. ఈ విష‌యం గురించి ఆయ‌న‌కు ముందుగా ఏమీ చెప్ప‌క‌పోవ‌డంతో బాగా ఫీల‌య్యారని.. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

జ‌గ‌ప‌తి పాత్రను ప్ర‌కాష్ రాజ్ తో చేయించాలి అనుకుంటున్నార‌ట‌. సీనియ‌ర్ హీరోయిన్ విజ‌య‌శాంతి ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. ప్రచారంలో ఉన్న వార్త‌ల పై చిత్ర యూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here