Home Actor స‌రిలేరు నీకెవ్వ‌రులో.. సంగీత‌.?

స‌రిలేరు నీకెవ్వ‌రులో.. సంగీత‌.?

71
0
స‌రిలేరు నీకెవ్వ‌రులో.. సంగీత‌.? spiceandhra

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 26 నుంచి  హైద‌రాబాద్ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమా గురించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… తెలుగు తెరపై అటు గ్లామర్ పరంగాను .. ఇటు ప‌ర్ ఫార్మెన్స్  పరంగాను మంచి పేరు తెచ్చుకున్న నిన్నటితరం కథానాయికల్లో సంగీత ఒకరు. ఖ‌డ్గం సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువ‌చ్చింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది.  ఈ మధ్యనే తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

స‌రిలేరు నీకెవ్వ‌రులో సంగీత ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తుంద‌ట‌. అనిల్ రావిపూడి ఇటీవ‌ల సంగీత‌కు క‌థ గురించి ఆమె క్యారెక్ట‌ర్ గురించి చెప్పి ఒప్పించార‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ లో జాయిన్ కానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సో.. సంగీత‌కు తెలుగులో ఈ మూవీ రీ ఎంట్రీ. మ‌రి.. ఈ సినిమాతో వ‌రుస‌గా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుని బిజీ అవుతుందేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here