Home Actor స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ అప్పుడే అయిపోయిందా..?

స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ అప్పుడే అయిపోయిందా..?

47
0
స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ అప్పుడే అయిపోయిందా..? spiceandhra

సూపర్ స్టార్ మహేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని మ‌హేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్ ను కాశ్మీర్ లో చిత్రీక‌రించారు. మహేష్ బాబుతో సహా, మరికొందరు ఆర్టిస్టులు పాల్గొన్న ఈ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయిందని, ఈ నెల 26 నుండి హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ప్రారంబించబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

అంతే కాకుండా… సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో వ‌ర్క్ చేయ‌డం అద్బుతమైన అనుభవం.. ఎప్పటికి మరిచిపోలేనిదని..సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేయలేక‌పోతున్నాను. ఈ నెల 26 నుంచి హైద‌రాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించ‌నున్నాం అని తెలియ‌చేసారు. 

సూపర్ స్టార్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్న జోడి కడుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.  యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు సినెమాటోగ్రఫీని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here