Home Actor స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ లో.. బండ్ల గ‌ణేష్.

స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ లో.. బండ్ల గ‌ణేష్.

19
0
స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ లో.. బండ్ల గ‌ణేష్. spiceandhra

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు.  ఈ సినిమాలో ఆయన జోడీగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో బండ్ల గణేష్‌ నటించనున్నట్టుగా వార్తలు వచ్చిన విష‌యం తెలిసిందే.

ఇటీవల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత ఓ వైపు న‌ట‌న‌కు, మ‌రో వైపు సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తోన్న బండ్ల గ‌ణేష్… మ‌హేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో వేసిన ట్రైన్ సెట్ లో షూటింగ్ జ‌రుగుతోంది.

మ‌హేష్ బాబు, ర‌ష్మిక మిగిలిన న‌టీన‌టుల‌పై చిత్రీక‌రించే ఈ ట్రైన్ ఎపిసోడ్ లో బండ్ల గ‌ణేష్ జాయిన్ అయ్యాడ‌ట‌. బండ్ల చేసే కామెడీ ఓ రేంజ్ లో ఉంటుంద‌ని.. ఆడియ‌న్స్ కి ఈ ఎపిసోడ్ విప‌రీతంగా న‌చ్చుతుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. సీనియ‌ర్ హీరోయిన్  విజయశాంతి కూడా ఈ సినిమా ద్వారానే రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here