Home Political News స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ మ‌హా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ..!

స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ మ‌హా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ..!

108
0

సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ మహా విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ చీఫ్ అమిత్‌ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ఉప ముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్ ప‌టేల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కేవడియాలో 182 మీటర్ల ఎత్తైన ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారీ విగ్రహం. విగ్రహం ఛాతి వరకు వెళ్లి సందర్శకులు చూసేలా రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. దాదాపు 157 మీటర్ల ఎత్తు వరకు సందర్శకులు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన‌ట్టు మోదీ ప్ర‌క‌టించారు.

ఈ మ‌హా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ…భారత తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ చొరవ చూపకుంటే గుజరాత్ లోని గిర్ సింహాలను చూడటానికి, సోమనాథ్ ఆలయాన్ని, హైదరాబాద్ లోని చార్మినార్ ను సందర్శించడానికి కూడా భారతీయులు వీసా తీసుకోవాల్సి వచ్చేది అన్నారు. పటేల్ దూరదృష్టి, తెలివితేటల కారణంగానే దేశంలో 562 స్వదేశీ సంస్థానాలను విలీనం చేయగలిగారని తెలిపారు. దేశవిభజన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్, ఇతర కేంద్ర సర్వీసులను పటేల్ గాడిలో పెట్టారన్నారు. అంతేకాకుండా పంచాయితీ ఎన్నికల్లో మహిళలు పోటీచేసేలా పటేల్ చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here