Home Telugu స‌వ్య‌సాచి…ఎనౌన్స్ చేసిన డేట్ కి వ‌స్తున్నాడా..? 

స‌వ్య‌సాచి…ఎనౌన్స్ చేసిన డేట్ కి వ‌స్తున్నాడా..? 

107
0

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చైతు స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం న్యూయార్క్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. చైతు, నిధి అగ‌ర్వాల్ పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో… మాధ‌వ‌న్, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. న్యూయార్క్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని టీమ్ ఈనెల 18కి ఇండియా చేరుకుంటారని తెలిసింది. ఆత‌ర్వాత హైద‌రాబాద్ లో ఓ సాంగ్ & ప్యాచ్ వ‌ర్క్ షూట్ చేయ‌నున్నారు. దీంతో షూటింగ్  కంప్లీట్ కానుంది.

ఈ నెలాఖ‌రున టీజ‌ర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇక సినిమాను జూన్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎప్పుడో ఎనౌన్స్ చేసారు. ఇప్పుడు అదే రోజున‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో స‌వ్య‌సాచి జూన్ 14న రిలీజ్ అవుతుందా..?  లేక వాయిదా ప‌డుతుందా..?  అనేది ఆస‌క్తిగా మారింది.  ఈ రెండు చిత్రాల నిర్మాత‌ల మ‌ధ్య రిలీజ్ విష‌య‌మై టాక్స్ జ‌రుగుతున్నాయ‌ని…అందుచేత ఈ రెండింటిలో ఏదో ఒక సినిమా మాత్ర‌మే జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి…జూన్ 14న స‌వ్య‌సాచి అంటూ నాగ చైత‌న్య‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడా..?  లేక సాక్ష్యం అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ‌స్తాడా..?  అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here