Home Telugu స‌వ్య‌సాచి మ‌ళ్లీ వాయిదా ప‌డిందా..?

స‌వ్య‌సాచి మ‌ళ్లీ వాయిదా ప‌డిందా..?

112
0

అక్కినేని నాగచైత‌న్య ఓ వైపు స‌వ్య‌సాచి సినిమా చేస్తూనే…మ‌రో వైపు శైల‌జారెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నాడు. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌వ్య‌సాచి స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ…ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. కార‌ణం..గ్రాఫిక్స్ వ‌ర్క్ వ‌ల్ల ఆల‌స్యం అవుతుంద‌ని చెబుతున్నారు. గ్రాఫిక్స్ వ‌ర్క్ చేసే బాధ్య‌త ఓ సంస్థ‌కి ఇచ్చార‌ట. ఆ సంస్థ చేసిన గ్రాఫిక్స్ వ‌ర్క్ సంతృప్తిగా లేక‌పోవ‌డంతో ఇప్పుడు బాహుబ‌లికి వ‌ర్క్ చేసిన మ‌కుట సంస్థ‌కే ఆ బాధ్య‌త‌లు ఇచ్చార‌ని స‌మాచారం.

జులై నెలాఖ‌రున స‌వ్య‌సాచి రిలీజ్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత ఆగ‌ష్టు ఫ‌స్ట్ వీక్ అంటూ మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ..లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…ఆగ‌ష్టులో కూడా డౌటే అంటున్నారు. మ‌రో ప‌క్క మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శైల‌జారెడ్డి అల్లుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈరోజు నుంచి రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. జులైకి షూటింగ్ కంప్లీట్ చేసి ఆగ‌ష్టు నెలాఖ‌రున ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే…స‌వ్య‌సాచి కంటే ముందుగా శైల‌జారెడ్డి అల్లుడు ధియేట‌ర్లోకి వ‌చ్చేసాడ‌నిపిస్తోంది. ఈ క‌న్ ఫ్యూజ‌న్ కి క్లారిటీ ఇచ్చేలా త్వ‌ర‌లోనే మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ స‌వ్య‌సాచి టీజ‌ర్ & రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here