Home Uncategorized స‌వ్య‌సాచి రివ్యూ..!

స‌వ్య‌సాచి రివ్యూ..!

149
0

యువ స‌మ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య – ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌వ్య‌సాచి. చైతు, చందు క‌లిసి చేసిన తొలి చిత్రం ప్రేమ‌మ్ స‌క్స‌స్ కావ‌డం..మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు నిర్మించిన శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, రంగ‌స్థ‌లం చిత్రాలు బ్లాక్ బ‌ష్ట‌ర్స్ అవ్వ‌డంతో ఈ సినిమా కూడా సంచ‌ల‌న విజ‌యం సాధిస్తుంద‌నే పాజిటివ్ టాక్ ఫ‌స్ట్ నుంచి ఉంది. దీనికి తోడు టీజ‌ర్, ట్రైల‌ర్ అండ్ సాంగ్స్ కు విశేష స్పంద‌న రావ‌డంతో స‌వ్య‌సాచి ఖ‌చ్చితంగా చైత‌న్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా స‌వ్య‌సాచి ఈరోజు (న‌వంబ‌ర్ 2) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి..స‌వ్య‌సాచి అంచ‌నాలను అందుకుందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – కులు వ్యాలీ బస్సులో 21 మంది ప్ర‌యాణిస్తుంటారు. ఈ 21 మందికి ఊహించ‌ని విధంగా అరుణ్ (మాధ‌వ‌న్)తో ప‌రిచ‌యం ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ఆ బస్సు లోయ‌లో ప‌డిపోతుంది. అయితే…ఈ ప్ర‌మాదం నుంచి ఒక్క విక్ర‌మ్ ఆదిత్య (నాగ చైత‌న్య‌) మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తాడు. ఆత‌ర్వాత విక్ర‌మ్ ఆదిత్య హాస్ప‌ట‌ల్ నుంచి అక్క‌, బావ (భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి) ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. అక్క కూతురు మ‌హా అంటే విక్ర‌మ్ ఆదిత్య‌కు ప్రాణం. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కార‌ణంగా విక్ర‌మ్ ఎడ‌మ చేయి అత‌ని కంట్రోల్ లో ఉండ‌దు.  కోపం వ‌చ్చినా, ఆనందం వ‌చ్చినా ఎడ‌మ చేయి రియాక్ట్ అవుతుంటుంది. అది ఓ పెద్ద స‌మ‌స్య‌గా విక్ర‌మ్ భావిస్తుంటాడు.

ఇదిలా ఉంటే..విక్ర‌మ్ ఆదిత్య కాలేజీలో చిత్ర (నిధి అగ‌ర్వాల్)ను ప్రేమిస్తాడు. త‌న ప్రేమ విష‌యాన్ని చిత్ర‌తో తెలియ‌చేసే టైమ్ లో అనుకోకుండా అక్క నుంచి ఫోన్ రావ‌డంతో ఇప్పుడే వ‌స్తాన‌ని చెప్పి వెళ్లిపోతాడు. అలా..వెళ్లిన విక్ర‌మ్ ఆదిత్య మ‌ళ్లీ 6 సంవ‌త్స‌రాల త‌ర్వాత చిత్ర‌ను క‌లుస్తాడు. త‌ను ఎందుకు అలా వెళ్లాల్సి వ‌చ్చిందో చెప్ప‌డం..చిత్ర అర్ధం చేసుకోవ‌డం జ‌రుగుతుంది. అలా సాఫీగా వెళుతున్న టైమ్ లో విక్ర‌మ్ ఆదిత్య అక్క ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో బావ చ‌నిపోతాడు. అక్క హాస్ప‌ట‌ల్ లో ఉంటుంది. మ‌హా చ‌నిపోతుంది. బాధ‌లో ఉన్న విక్ర‌మ్ ఆదిత్య‌కు మ‌హా బ‌తికే ఉంద‌ని తెలుస్తుంది కానీ..ఎక్క‌డ ఉందో తెలియ‌దు. దీనంత‌టికి కార‌ణం అరుణ్ అని తెలుసుకుంటాడు. అస‌లు అరుణ్ ఎవ‌రు..?  ఎందుకు విక్ర‌మ్ ఆదిత్య పై ప‌గ తీర్చుకుంటున్నాడు..?  మ‌హా ఎక్క‌డు ఉంది అనేది విక్ర‌మ్ ఎలా తెలుసుకున్నాడు..?  అరుణ్ కి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

నాగ చైత‌న్య‌, మాధ‌వ‌న్ న‌ట‌న‌

ఫైట్స్

కామెడీ సీన్స్

కీర‌వాణి సంగీతం

మైన‌స్ పాయింట్స్

క‌థ‌నం స‌రిగా లేక‌పోవ‌డం

ఫ‌స్టాఫ్ లో ప‌ట్టులేక‌పోవ‌డం.

విశ్లేష‌ణ –  ఎడ‌వ చేయి త‌న కంట్రోల్ లో లేకపోవ‌డంతో ఇబ్బంది ప‌డే క్యారెక్ట‌ర్ లో చైతన్య చాలా చ‌క్క‌గా న‌టించాడు. న‌ట‌న‌లో, డ్యాన్స్ లో, ఎమోష‌న్ సీన్స్ లో పూర్తి న్యాయం చేసాడు. విల‌న్ మాధ‌వ‌న్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మాధ‌వ‌న్ క్యారెక్ట‌ర్ సినిమాకి హైలైట్ అని చెప్ప‌చ్చు. ఇక నిథి అగ‌ర్వాల్ కొత్త అమ్మాయి అయిన‌ప్ప‌టికీ స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు బాగా న‌టించింది. చైతు, నిధి జంట చూడ‌చ‌క్క‌గా ఉంది. ఇక వెన్నెల కిషోర్, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ ఆడియ‌న్స్ ని బాగా ఎంట‌ర్ టైన్ చేసింది. భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి, రావు ర‌మేష్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే..కార్తీకేయ‌, ప్రేమ‌మ్ అనే ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీస్ అందించిన చందు మొండేటి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే కొత్త పాయింట్ ని తీసుకుని క‌థ రాసుకోవ‌డం బాగుంది కానీ..క‌థ‌నంలో చందు త‌డ‌బ‌డ్డాడు అని చెప్ప‌చ్చు. బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం.. ఫ‌స్టాఫ్ ల‌వ్ స్టోరీ, కామెడీతో న‌డ‌ప‌డం వ‌ల‌న అక్క‌డ‌క్క‌డ బోరింగ్ గా అనిపిస్తుంటుంది. అస‌లు క‌థ సెకండాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ల‌వ్ స్టోరీ కూడా సీరియ‌స్ గా కాకుండా ఏదో కావాలి కాబ‌ట్టి పెట్టిన‌ట్టుగా అనిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డ లాజిక్స్ మిస్ అయ్యాయి. టైటిల్ సాంగ్ బాగుంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా నిర్మించారు అనేలా ప్ర‌తి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. చైన్ అయినా..చున్నీ అయినా వాళ్ల చేతిలో ప‌డితే ఆ ఛరిష్మానే వేరు..అనే డైలాగ్..అక్క‌డ‌క్క‌డా నాగార్జున, నాగేశ్వ‌ర‌రావు సినిమా స‌న్నివేశాలు చూపించ‌డం బాగుంది. ఈ సీన్స్ కి  అభిమానులు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. మ‌రి..సామాన్యుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో చూడాలి.

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here