Home Actor హండ్రెడ్ ప‌ర్సంట్ నా కోరిక నెర‌వేరింది – రామ్ గోపాల్ వ‌ర్మ‌..!

హండ్రెడ్ ప‌ర్సంట్ నా కోరిక నెర‌వేరింది – రామ్ గోపాల్ వ‌ర్మ‌..!

141
0

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు నందమూరి తార‌క‌ రామారావు జ‌యంతి ఈరోజు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. విజయవాడలోని పైపుల రోడ్డు సెంటర్ కు వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి కారులో వెళ్లారు. ఆ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వర్మ పూల మాల వేశారు.

ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో వర్మ మాట్లాడుతూ… స్వర్గీయ ఎన్టీఆర్ గారి దయ వల్ల ఎట్టకేలకు పైపుల రోడ్డు సెంటర్ కు రావాలన్న కోరిక  హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిందని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రెస్ మీట్ పైపుల రోడ్డులో నిర్వహించేందుకు ఇటీవల అక్కడికి వెళ్లాలనుకున్న వర్మకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ వివాద‌స్ప‌ద చిత్రాన్ని ఈ నెల‌ 31న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రిలీజ్ చేయ‌నున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here