Home Actor హిప్పీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

హిప్పీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

75
0

యువ హీరో కార్తికేయ ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడో తెలిసిందే. తాజాగా హిప్పీ అనే డిఫ‌రెంట్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి టి.ఎన్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌లైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 త‌ర్వాత హీరో కార్తికేయకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కార్తికేయ‌ తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల నాని రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…ఈ నెల 9న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. డిఫ‌రెంట్ కాన్సప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. హిప్పీ అని టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఒక‌టే డౌట్. అస‌లు హిప్పీ అంటే ఏంటి అని. ఇదే విష‌యం గురించి డైరెక్ట‌ర్ టి.ఎన్.కృష్ణ స్పందిస్తూ..హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

అలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడం ఛాలెంజ్‌గా అనిపిస్తున్నది. వెరీ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ ఇది. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 7న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here