Home Actor హిప్పీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..!

హిప్పీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..!

82
0

ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో కార్తికేయ తాజా చిత్రం హిప్పీ. ఈ చిత్రానికి టి.ఎన్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌లైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కార్తికేయకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కార్తికేయ‌ తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు హిప్పీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు.

కార్తికేయ సరసన నాయికగా దిగాంగన నటిచంగా, ఒక కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి న‌టించారు. అమ్మాయిల‌తో స‌ర‌దాగా గ‌డిపేసే హిప్పీ త‌ను మ‌న‌సుప‌డిన అమ్మాయి ల‌వ్ ఇన్ రిలేష‌న్ షిప్ లో ఉండాల్సి వ‌స్తుంది. ఆత‌ర్వాత అత‌ని లైఫ్ లో  ఏం జ‌రిగింది అనేదే ఈ సినిమా క‌థ అనిపిస్తుంది. లవ్, యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ తో కూడిన సన్నివేశాలతో  ట్రైలర్ ను కట్ చేశారు.

యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంద‌నిపిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ సినిమా పై కార్తికేయ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. జూన్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి.. ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న హిప్పీ హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here