Home Actor హిప్పీ రివ్యూ..!

హిప్పీ రివ్యూ..!

91
0

ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవంశీ హీరో,హీరోయిన్లుగా టి.ఎన్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం హిప్పీ. ఈ చిత్రాన్ని వి. క్రియేషన్స్‌ పతాకం పై కలైపులి ఎస్‌. థాను నిర్మించారు. ఈ మూవీ ట్రైల‌ర్ కు విశేష స్పంద‌న రావ‌డం..ఆర్ఎక్స్ 100 త‌ర్వాత కార్తికేయ న‌టించిన‌ సినిమా కావ‌డంతో ఈ సినిమా పై ఆస‌క్తి ఏర్ప‌డింది.  వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్  ఈరోజు (జాన్ 6న) విడుదల అయ్యింది. మ‌రి… హిప్పీ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుందా..?  కార్తికేయ‌కు హిట్ అందించిందా..?  లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

– హిప్పీ దేవ‌దాస్ (కార్తికేయ‌) ఇంజ‌నీరింగ్ కంప్లీట్ చేసి మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ టైమ్ లో స్నేహ (జ‌బ్బా సింగ్)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. స్నేహ‌తో క‌లిసి గోవా వెళ్లిన‌ప్పుడు ఆమె ఫ్రెండ్ ఆమూక్త మాల్య‌ద (దిగంగ‌న సూర్య‌వంశీ)తో మ‌ళ్లీ  ప్రేమ‌లో ప‌డ‌తాడు. స్నేహ పై త‌న‌కున్న‌ది ప్రేమ కాద‌ని..కేవ‌లం ఆకర్ష‌ణ మాత్ర‌మే అని హిప్పీ ఫీల‌వ‌డంతో స్నేహ వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆత‌ర్వాత హిప్పీ ఆమూక్త మాల్య‌ద చుట్టు తిరుగుతుంటాడు.

 ఆఖ‌రికి హిప్పీ కి ఆమూక్త మాల్య‌ద ఓకే చెబుతుంది కాక‌పోతే..త‌న‌కిష్ట‌మైన కండీష‌న్స్ పెడుతూ హిప్పీకి న‌ర‌కం చూపిస్తుంది. దీంతో హిప్పీ ఆమూక్త మాల్య‌ద‌ను వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో హిప్పీకి త‌న బాస్ అర‌వింద్ (జె.డి. చ‌క్ర‌వ‌ర్తి) ఓ షాక్ ఇస్తాడు. ఇంత‌కీ ఆ షాక్ ఏంటి..? చివ‌రికి హిప్పీ ఆమూక్త మాల్య‌ద‌ను వ‌దిలించుకున్నాడా..?  లేదా..?  చివ‌రికి ఏమైంది అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేష – ఆర్ఎక్స్ 100 సినిమాలో భ‌గ్న ప్రేమికుడుగా అద్భుతంగా న‌టించి మెప్పించిన కార్తికేయ ఈ సినిమాలో  రొమాన్స్ సీన్స్ లోను, యాక్ష‌న్ సీన్స్ లో వేరియేష‌న్స్ చూపించి సూప‌ర్ గా న‌టించాడే అనిపించాడు. హీరోయిన్ దిగంగ‌న సూర్య‌వంశీ ఓ వైపు ఫెర్ ఫార్మెన్స్, మ‌రో వైపు గ్లామ‌ర్ చూపించి ఆక‌ట్టుకుంది. ముఖ్య పాత్ర పోషించిన జెడీ చ‌క్ర‌వ‌రి డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ తో తెలంగాణ యాస‌లో మాట్లాడుతూ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసారు. వెన్నెల కిషోర్, బ్ర‌హ్మాజీ త‌న‌దైన శైలిలో న‌టించి న‌వ్వించారు. శ్ర‌ద్ధాదాస్ అతిధి పాత్ర‌లో క‌నిపించి ఓకే అనిపించింది.

ఒక అమ్మాయిని ప్రేమించ‌డం..ఆత‌ర్వాత ఆ అమ్మాయిని వ‌దిలించుకోవాల‌నుకోవ‌డం త‌ర‌హా క‌థలు గ‌తంలో వ‌చ్చాయి. కాక‌పోతే ఇందులో నేటి ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా మ‌సాలా కాస్త ఎక్కువ చేసి యూత్ ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసారు డైరెక్ట‌ర్ కృష్ణ. ఆయ‌న  క‌థ విష‌యంలో ఇంకొంచెం వ‌ర్క్ చేసుంటే బాగుండేది. అక్క‌డ‌క్క‌డా క‌థ‌ను సాగ‌దీసిన ఫీలింగ్ క‌లుగుతుంది. జెడి చెప్పే డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ అతిగా అనిపిస్తాయి. ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి… నివాస్‌ కే ప్రసన్నా సంగీతం బాగున్నాయి. క‌లైఫులి ఎస్ .థాను ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిలీతో ఈ సినిమాని నిర్మించారు.

రేటింగ్ – 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here