Home Entertainment హిమాల‌యాల్లో ఆదిమాన‌వుడి జాడ‌లు…హ‌నుమంతుడేనా..ఫోటోలు ప్ర‌చురించిన భార‌త సైన్యం..!

హిమాల‌యాల్లో ఆదిమాన‌వుడి జాడ‌లు…హ‌నుమంతుడేనా..ఫోటోలు ప్ర‌చురించిన భార‌త సైన్యం..!

66
0

హిమాల‌యాల్లో ఆది మాన‌వులు నివ‌సిస్తున్నార‌న్న మాట ఎప్పటి నుంచో ఉంది. ఎత్త‌యిన విగ్ర‌హం, భారీగా ఉండే కాళ్లు చేతులు క‌ల్గి ఉంటార‌ని చెబుతుంటారు. ఇదంతా హ‌నుమంతుడి పోలిక‌లు అని చెప్పేవారు కూడా లేక‌పోలేదు. ఈ విష‌యాన్ని పక్క‌న పెడితే ఈ ఆదిమాన‌వుడి రూపాన్ని చూశామ‌ని అప్పుడ‌ప్పుడు కొంద‌రు టూరిస్టులు అంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి నిక‌ర‌మైన ఆధారాలు అయితే ఏమీ దొర‌క‌టం లేదు.

కానీ భార‌త సైన్యం మంగ‌ళ‌వారం నాడు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆది మాన‌వుడి పోలిన భారీ వ్య‌క్తికి సంబంధించిన పాద ముద్ర‌ల్ని గుర్తించామ‌ని ప్ర‌క‌టించింది. దాదాపుగా 32 అంగుళాల పొడ‌వు, 15 అంగుళాల వెడ‌ల్పు ఉండే పాద ముద్ర‌ల్ని గుర్తించారు. ఇంత‌టి భారీ స్థాయిలో పాదాలు ఉన్నాయి అంటే స‌ద‌రు వ్య‌క్తి పొడవు కూడా భారీగా ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేయ‌టం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుద‌ల చేసింది. భార‌త సైన్యంలోని మౌంట‌నీరింగ్ ఎక్సుపీడిష‌న్ టీమ్ అన్వేష‌ణ‌లో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. మ‌క‌లు బేస్ క్యాంప్ కు స‌మీపంలో ఈ పాద ముద్ర‌లు క‌నిపించాయ‌ని భార‌త సైన్యం ట్వీట్ చేసింది.

 మొత్తం మీద హిమాల‌యాల్లో ఆదిమాన‌వులు ఉంటున్నార‌నే విష‌యంలో మ‌రో సారి చ‌ర్చ‌నీయాంశం గా మారింది. అక్క‌డ ఉండే వారి మీద గ‌తంలో డీ ఎన్ ఏ ప‌రిశోధ‌న‌లు కూడా జ‌రిగాయి. వీటి ఆధారంగా కూడా ఈ ప్రాంతంలో ఆదిమాన‌వులు ఉండ‌వ‌చ్చ‌న్న వాద‌న వినిపించింది. ఈ క్ర‌మంలో భార‌త సైన్యం అధికారికంగా ధ్రువీక‌రించటం ఆసక్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here