Home Movie News హృద‌యాన్ని హ‌త్తుకుంటున్న స‌వ్య‌సాచి పాట‌..!

హృద‌యాన్ని హ‌త్తుకుంటున్న స‌వ్య‌సాచి పాట‌..!

99
0

యువ స‌మ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య‌, ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న‌ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించింది. మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందించ‌డం విశేషం. ఈ రోజు ఈ చిత్రంలోని అమ్మ పాట‌ను రిలీజ్ చేసారు.

ఒక్కరంటే ఒక్కరు .. ఇద్దరంటే ఇద్దరు .. ఒక తనువును ఎదిగిన కవలలు .. ఒక తీరున కదలని తలపులు .. ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు .. అమ్మకదే పదివేలు అంటూ సాగే ఈ పాట విన్న వెంట‌నే..హృద‌యానికి హ‌త్తుకుంటుంది. ఒకే తనువుగా కలిగిన తన కవల పిల్లల గురించి ఒక తల్లి పాడే పాటగా ఇది కొనసాగుతోంది. నా కలలకు రెక్కలు మీరు .. నా ఎనిమిది దిక్కులు మీరు అంటూ తన పిల్లల గురించి ఓ తల్లి ఆవిష్కరించడం అద్భుతమనే చెప్పాలి. ఈ పాట‌ను రామజోగయ్య శాస్త్రి రాసారు. ఈ నెలాఖ‌రున ఆడియోను రిలీజ్ చేసి..ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని న‌వంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here