Home Actor హైద‌రాబాద్ లో ఓ బేబి (స‌మంత) భారీ క‌టౌట్ అదిరిందిగా..!

హైద‌రాబాద్ లో ఓ బేబి (స‌మంత) భారీ క‌టౌట్ అదిరిందిగా..!

65
0
హైద‌రాబాద్ లో ఓ బేబి స‌మంత‌ భారీ క‌టౌట్ అదిరిందిగా..! spiceandhra

స‌మంత అక్కినేని న‌టించిన తాజా చిత్రం ఓ..బేబి. నందినీ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి,  రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా పై ప్రారంభం నుంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అయితే…ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. టీమ్ కాన్ఫిడెన్స్  తో పాటు ఆల్రెడీ సినిమా చూసిన వ‌క్త‌ల మాట‌ల‌తో బేబి పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయ‌ని చెప్ప‌చ్చు. ఈ నెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్  దేవి థియేటర్ లో సమంత నిలువెత్తు కటౌట్ ను ఏర్పాటు చేశారు.

 స్టార్ హీరోల‌కు ఈ రేంజ్ లో క‌టౌట్ లు ఏర్పాటు చేస్తుంటారు. స‌మంత‌కి ఇలా భారీ క‌టౌట్ పెట్టారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. స‌మంత క‌టౌట్  స్టిల్ సోషల్ మీడియాలో సమంత, అక్కినేని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here