Home Actor హైద‌రాబాద్ వ‌చ్చి మ‌రీ..ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన ఉండ‌వ‌ల్లి..!

హైద‌రాబాద్ వ‌చ్చి మ‌రీ..ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన ఉండ‌వ‌ల్లి..!

94
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాని ఈ నెల 29న రిలీజ్ చేసారు. అయితే…ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆదేశాల మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌లేదు. మిగిలిన చోట్ల రిలీజ్ అయిన ఈ చిత్రానికి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. నిన్న నాలుగు ఆట‌లు హౌస్ ఫుల్ అయ్యాయి అంటే..ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇదిలా ఉంటే…కోర్టు ఆదేశాల మేర‌కు రాజ‌మండ్రిలో రిలీజ్ కాక‌పోవ‌డంతో ప్రముఖ రాజకీయ నాయ‌కుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్ కు వచ్చి మ‌రీ..ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ చిత్రానికి గీత రచయిగా పని చేసిన సిరాశ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్ లతో కలిసి ఉండవల్లి ఈ చిత్రం చూశారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ర‌చ‌యిత‌ సిరాశ్రీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here