Home Actor హ్యాపీ బ‌ర్త్ డే టు.. అవ‌స‌రాల శ్రీనివాస్..!

హ్యాపీ బ‌ర్త్ డే టు.. అవ‌స‌రాల శ్రీనివాస్..!

104
0


క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని..ఆత‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారి వైవిధ్య‌మైన చిత్రాలు అందిస్తోన్న క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్. అష్టా చ‌మ్మా, స‌ర‌దాగా కాసేపు, గోల్కండ హైస్కూల్, పిల్ల జ‌మీందార్, ముగ్గురు, అర‌వింద్ 2, కంచె, నాన్న‌కు ప్రేమ‌తో..త‌దిత‌ర చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు న‌టించారు. ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించారు. ఆత‌ర్వాత రెండో ప్ర‌య‌త్నంగా జ్యోఅచ్యుతానంద సినిమాని తెర‌కెక్కించారు.

తాజాగా యువ హీరో నాగ శౌర్య‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య స‌ర‌స‌న మాళ‌వి నాయ‌ర్ న‌టిస్తోంది. త‌న చిత్రాల‌కు ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద..ఇలా తెలుగుద‌నం ఉట్టిప‌డేలా టైటిల్స్ పెడుతుంటారు. తాజా చిత్రానికి కూడా త‌న‌దైన శైలిలో ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి అనే టైటిల్ ఖ‌రారు చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తెలుగును మ‌రిచిపోతూ.. వైవిధ్యం కోసం అంటూ ఇంగ్లీషు టైటిల్స్ పెడుతున్న ఈ రోజుల్లో తెలుగుద‌నం ఉట్టిప‌డేలా టైటిల్స్ పెడుతున్న అవ‌స‌రాల ఎంతైనా అభినంద‌నీయుడు. ఓ వైపు న‌టుడుగా, మ‌రో వైపు ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్న ఈ న‌ట ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా నాగ శౌర్య‌తో చేస్తున్నసినిమా సెట్ లోనే అవ‌స‌రాల పుట్టిన‌రోజును చిత్ర యూనిట్ సెల‌బ్రేట్ చేసారు. ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి చిత్రంతో మంచి విజ‌యాన్ని సాధిస్తార‌ని ఆశిస్తూ..హ్యాపీ బ‌ర్త్ డే టు అవ‌స‌రాల శ్రీనివాస్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here