Home Actor హ్యాపీ బ‌ర్త్ డే టు నితిన్..!

హ్యాపీ బ‌ర్త్ డే టు నితిన్..!

76
0


జ‌యం సినిమాతో తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడుగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతో విజ‌యం సాధించిన యువ హీరో నితిన్. దిల్, శ్రీ ఆంజ‌నేయం, సై..ఇలా విభిన్న క‌థా చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న నితిన్ ఆత‌ర్వాత…ధైర్యం, రామ్, ట‌క్క‌రి, ఆటాడిస్తా..త‌దిత‌ర చిత్రాల‌ వ‌రుస ప‌రాజ‌యాల‌తో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డ్డారు. ఇష్క్ సినిమాతో స‌క్స‌స్ సాధించి మ‌ళ్లీ కెరీర్ లో స్పీడు పెంచాడు. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.

హార్ట్ ఎటాక్, అ ఆ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న నితిన్ ఆత‌ర్వాత మ‌ళ్లీ లై, ఛ‌ల్ మోహ‌న రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో కెరీర్ లో వెన‌క‌బ‌డ్డాడు. కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ మ‌ళ్లీ వ‌రుస విజ‌యాలు సాధించేందుకు ప‌క్కా ప్లాన్ తో రెడీ అయ్యారు. ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌ ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో నితిన్ స‌ర‌స‌న ఛ‌లో ఫేమ్ ర‌ష్మిక న‌టిస్తుంది.

నితిన్ పుట్టిన‌రోజు ఈ రోజు (మార్చి 30). ఈ సంద‌ర్భంగా సితార ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ భీష్మ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసింది. దీనికి సింగిల్ ఫరెవర్ అనేది ట్యాగ్ లైన్. ఈ పోస్టర్ ను బట్టి ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ..మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటూ..హ్యాపీ బ‌ర్త్ డే టు నితిన్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here